Perni Nani: జగన్‌పై విషం చిమ్ముతున్నారు...! 15 d ago

AP : ప్రజల్లో వైఎస్ జగన్ ఇమేజ్ తగ్గించాలని సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. చంద్రబాబు మెప్పు కోసమే లోక్ సభలో ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు విషం చిమ్ముతున్నారే తప్ప, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టులపై మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. పల్నాడు సమస్యలను కూడా శ్రీ కృష్ణ దేవరాయులు లోక్ సభలో ఎప్పుడూ చర్చించలేదన్నారు.
చంద్రబాబుకు ఇచ్చిన ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులపై, ఆయన పీఏ శ్రీనివాస్ చేసిన స్కిల్ స్కామ్ గురించి లోక్ సభలో ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు మాట్లాడితే బాగుంటుందన్నారు. అమరావతి భూముల్లో వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని, చంద్రబాబు డబ్బు మూటలను దుబాయ్ చేర్చడానికి పీఏ శ్రీనివాస్‌ను వాడుతున్నారని పేర్కొన్నారు.
లోక్ సభలో కేఆర్ఎంబీపై ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు ఎందుకు ప్రస్తావించడం లేదని, నియోజకవర్గాల వర్గీకరణపై బీజేపీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. శ్రీ కృష్ణ దేవరాయులు 2019 - 24 వరకు ఏ పార్టీలో ఉన్నారని, తప్పులు జరిగితే ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి వైసీపీపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే లిక్కర్ స్కామ్ జరిగిందని, అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైన్ షాపుల్లో టీడీపీ నేతలు వాటాలు, లంచాలు తీసుకుంటున్నారన్నారు. గీత కార్మికులను పోలీసులతో బెదిరించి వైన్ షాపులను గుంజుకున్నారని పేర్కొన్నారు.